ఒక ఫైన్ మార్నింగ్ అంటే తెల్లవారిజామున తొమ్మిదికి అని అర్థం అన్నమాట. నిద్ర లేచి నా మొహం నేను
అద్దంలో చూసుకున్నా. నామీద నాకే జాలి వేసింది. ఎందుకు అంటే పడుకోబోయే ముందు అనుష్క ఫోటో , నిద్ర లేచాక అజంతా ఫోటో చూడాలి అన్నది నాకు నేను పెట్టుకున్న నియమం. అనుష్క ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అజంతా అంటారా అమ్మో నేను చెప్పను. అనుష్కా ఫోటో చూస్తే కలలో తనతో ఎంచక్కా జుం జుం మాయ అని డాన్సు చేసుకోవచ్చు. ఉదయం లేవటం తోటే అజంతా ఫోటో చూస్తే ఆఫీస్ లో రోజు మొత్తం ..ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏముందిలే .. అనుకుంటూ ఉండచ్చు- ఇది విషయం. ఈ రోజు నియమం తప్పా ఎన్ని కష్టాలో అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరా. దార్లో వెళ్తూ వెళ్తూ దుఖసాగర్ ... అదే లెండి ఈ బెంగళూరు లో ఆనంద సాగర్, శాంతి సాగర్ సుఖసాగర్ లు ఎక్కువ. అలాంటి ఒక దుఃఖసాగర్ కి వెళ్ళా. సర్వర్ ని వేడిగా ఏమున్నాయి అని అడిగా. వాడి వాలకం చూస్తే ప్రకాష్ రాజ్ లా ఉన్నాడు కొంప తీసి నిప్పులు కానితేడు కదా అనుకున్న కాని పొంగల్ తెచ్చాడు. దానికి పెరుగు పచ్చడి కాంబినేషన్. హతవిధీ ... చట్ని , సాంబార్ లేదా అంటే ఇది ఇంతే ఇష్టం ఉంటే తిను లేదా బిల్లు కట్టి పో బే అన్నట్టు చూసాడు. సరే అని .. గ్లాసు లో నీళ్ళు గట గట తాగేసి పొంగలి + పెరుగు పచ్చడిని గ్లాసు లోకి వంచుకొని ఒక్క సారి తొడ కొట్టి నేనే కనుక తెలుగు బ్లాగారునైతే నాకేం జరగకుండు గాక ... జై చెన్న కేశవ అని ఆ ద్రావకాన్ని తాగేసా.

ఆఫీస్ లోకి వెళ్ళటం వెళ్ళటం మా మేనేజర్ మొహం చూసా. తనేమో కింగ్స్ ఎలెవెన్ ఓనర్ ప్రీతి జింటా లా మొహం వేలాడేసుకొని ఉన్నాడు. పలకరిస్తే విలపిస్తాడేమో అని అనుమానం వేసి నా సీట్ లో వెళ్లి కూర్చొన్న. టైం చూస్తే పదిన్నర. కాసేపు వర్క్ చేసుకుందాం అని ఆర్కుట్, జి టాక్, పేస్ బుక్, యాహో ఓపెన్ చేశా. అంతలో మేనేజర్ పిలిచి పన్నెండింటికి కాల్ ఉంది అన్నాడు. ఎవరి తో ఎం విషయం అని డిటిల్స్ నేను అడగలేదు. ఆహా ఏముంది లే రోజు ఉండే తంతు కదా స్టేటస్ అడుగుతాడేమో అని, వారం క్రితం చేసిన వర్క్, వారం తరువాత చేయబోయే వర్క్ అన్ని ఈ రోజే చేసినట్టు ఒక్క ఎక్సెల్ షీట్ లో కుక్కి రెడి చేసి ఉంచా.

సమయం పన్నెండు అయింది. కాల్ మొదలయింది. నాకు నిద్ర వచ్చింది. ఎప్పుడు కాల్ లో చేసే పనే చివర్లో కూర్చొని ఎంచక్కా అనుష్క ఫోటోలు చూస్తూ నిద్ర లోకి జారుకున్న. కాసేపటికి చూస్తే మా మేనేజర్ అరుచుకుంటూ పక్క రూం కి వెళ్తున్నాడు. కొంపతీసి అనుష్క తో నా డాన్సు చూసేసాడా అనుకుంటూ వెళ్లి ఏంటి సార్ విషయం అని అడిగా. మేనేజర్ వెక్కి వెక్కి ఏడుస్తూ ... వెనకటికి ఎవడో తారకరత్న దగ్గరికి వెళ్లి వాడి సినిమా లో వేషం అడిగాడట అలా ఉంది ఇక్కడ నేను ప్రాజెక్ట్స్ లేక ఏడుస్తుంటే ఆ ఎదవ నన్ను ప్రాజెక్ట్స్ అవుట్సోర్స్ చెయ్యమంటాడు అని కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక లాభం లేదు అనుకొని నేను నా సీట్ దగ్గరకి వచ్చి Naukri ఓపెన్ చేసి నింపడం మొదలెట్టా.

వారెవ్వా ఏమి ఫేసు అచ్చం ... ఛి ఛి ..

Comments (7)

On April 28, 2010 at 3:30 PM , వాత్సల్య said...

SooparO sooparu...Chaccccha navvaleka aafeesulo.
as usual gaa paka vaallu nannu veeri peenuga ni choosinatlu choosaaru.
>>వెనకటికి ఎవడో తారకరత్న దగ్గరికి వెళ్లి వాడి సినిమా లో వేషం అడిగాడట అలా ఉంది
Idi adaraho

 
On April 28, 2010 at 4:47 PM , కొత్త పాళీ said...

సాఫ్ట్వేరు జీవితంలో ఒక పురుగు .. ఛ ఛ .. ఒక రోజు.
బాగారాశారు

 
On April 29, 2010 at 8:54 AM , కౌండిన్య said...

రిషి నెనరులు

కొత్తపాళి గారు ధన్యవాదాలు

 
On May 1, 2010 at 12:41 AM , హరే కృష్ణ said...

ఒక్క సారి తొడ కొట్టి నేనే కనుక తెలుగు బ్లాగారునైతే నాకేం జరగకుండు గాక ... జై చెన్న కేశవ అని ఆ ద్రావకాన్ని తాగేసా.
కెవ్వ్ కెవ్వ్
చాలా బాగా రాస్తున్నారు
ఇంకా ఈ కెవ్వ్ కేటగరీ లో చాలా పోస్ట్లు రాయాలని కోరుకొంటున్నాం

 
On May 1, 2010 at 10:01 PM , కౌండిన్య said...

హరేకృష్ణ గారు ధన్యవాదాలు

 
On May 7, 2010 at 12:26 PM , శ్రీవాసుకి said...

బాగా వ్రాసారు. హాస్యంగా బాగుంది. ఇంతకీ మీరు శ్రీశ్రీ అభిమానా.

శ్రీవాసుకి

 
On May 20, 2010 at 1:45 AM , Sai Praveen said...

తొలి టపా తరవాత గ్యాప్ ఇస్తే ఏంటో అనుకున్నా. back with a bang అన్నమాట :)
ఇంత ఆలస్యంగానా చూసేది అనకండి. అలా అయిపొయింది అంతే.